ATP: అనంతపురం జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల సమావేశాన్ని ఈనెల 29న నిర్వహిస్తామని శివశంకర్ గురువారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఈ జెండాలోని అంశాలపై చర్చ జరిపి తీర్మానాలకు ఆమోదం తెలుపుతారని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తప్పక హాజరు కావాలన్నారు.