అగ్నివీరులను దళాల్లో కొనసాగించే శాతంపై కీలక ప్రతిపాదన చర్చకు రానుంది. ప్రస్తుతం ఉన్న 25% మంది అగ్నివీరుల కొనసాగింపును ఏకంగా 75 శాతానికి పెంచాలని ప్రతిపాదన ఉంది. జైసల్మేర్లో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్లో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనుంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే అగ్నిపథ్ పథకంలో ఇది అతిపెద్ద మార్పు అవుతుంది.