BHPL: చిట్యాల మండల కేంద్రంలో గురువారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి రజనీకాంత్ మాట్లాడుతూ.. ఈ నెల 25న జనగామ జిల్లాలో జరిగే పత్తి రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పత్తి దిగుమతులపై 11% సుంకం కొనసాగించాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పత్తి క్వింటాకు రూ.10,075 ధర, రూ.475 బోనస్ చెల్లించాలని కోరారు.