మన్యం: కార్తీకమాసం ప్రారంభమైన సందర్భంగా శివాలయంలో అఖండ జ్యోతిని బుధవారం ఏర్పాటు చేశారు. సనాతన ధర్మ పరిషత్ సభ్యుల సహకారంతో సుబ్బగురువు సారథ్యంలో 20 ఏళ్లుగా కార్తీకమాసంలో అఖండజ్యోతిని ఏర్పాటు చేస్తున్నట్లు భక్తులు తెలిపారు. ఈ అఖండ జ్యోతి ఇప్ప నూనేతో పెట్టడం ద్వారా సకలశుభాలు కలుగుతాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.