BDK: తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ వైపునకు పాపికొండల విహార యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి బోట్లు నడుపుటకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. పోచవరం, పేరంటాలపల్లి మీదుగా పాపికొండల యాత్ర కొనసాగుతుందని చింతూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఇంచార్జ్ శుభం నోఖ్వాల్ తెలిపారు.