KMR: తాడ్వాయి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులను, త్వరగా ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. తాడ్వాయి మండలంలోని నందివాడలో బుధవారం సాయంత్రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరగా ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ తెలిపారు.