SRCL: రైతులు వారు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని తడగొండ, కోరెం, బోయినపల్లి, మర్లపేట, విలాసాగర్ ,గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.