రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలీవుడ్ మూవీ ‘థామా’. అక్టోబర్ 21 విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.11 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆ ఫ్రాంచైజ్‌లో ‘స్త్రీ 2’ తర్వాత రెండవ అత్యధిక ఓపెనర్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి ఆదిత్య సర్ఫోదర్ దర్శకత్వం వహించగా.. నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేష్ రావల్, ఫైజల్ మాలిక్ కీలక పాత్రలు పోషించారు.