కృష్ణా: మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఉనికి కాపాడుకోవడానికే విమర్శలు చేస్తున్నారని జనసేన నాయకుడు గుడివాక శివరావు అన్నారు. రమేష్ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదని, కానీ మండలి బుద్ధప్రసాద్ కృషి వల్లే దివిసీమలో రహదారులు, విద్యా సంస్థలు ఏర్పడ్డాయని తెలిపారు. వైసీపీ పాలనలో రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని ఎద్దేవా చేశారు.