గత కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కూడా పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.810 తగ్గి రూ.1,25,080కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,14,650గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.1,74,000 వద్ద కొనసాగుతోంది.