WGL: పోలీస్ జాగృతి కళాబృందం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని WGL పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో కళా బృందం సభ్యులతో సీపీ సమావేశమయ్యారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అంశాలపై ఆయన కళాబృందం ఇన్ఛార్జి ASE నాగమణిని అడిగి తెలుసుకున్నారు.