ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుంది. గురువారం ఉదయం 676 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎగువ కర్ణాటక నుంచి కొనసాగుతోందని జల వనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1655అడుగులు కాగా ప్రస్తుతం 1652 అడుగుల మేర నీరు వచ్చి చేరిందన్నారు.