NRML: జిల్లాలో ఇప్పటివరకు 47 మద్యం షాపులకు 225 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపర్ ఇండెంట్ అబ్దుల్ రజాక్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా బుధవారం మొత్తం ఏడు దరఖాస్తులు వచ్చాయని ఇప్పటివరకు 949 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. నేడు దరఖాస్తులకు చివరి తేదీ అని, ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు.