NZB: ధాన్యం లారీలను అన్లోడ్ చేసుకోకుండా రైస్‌మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. కోటగిరి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. లోడైన లారీలను మిల్లర్లు ఖాళీ చేయడం లేదన్నారు. తరుగు వస్తుందని అలాగే ఉంచుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.