HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జనవరి 6వ తేదీన వెలువడిన తుది జాబితా ప్రకారం 3,89,954 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈనెల 2న వెల్లడించిన ముసాయిదా జాబితా మేరకు కొత్తగా నమోదు చేసుకున్న వారితో కలిపి మొత్తం ఓటర్లు 3,92,669 మంది ఉండగా..పురుషులు 2,04,288, మహిళలు 1,88,356, ఇతరులు 25, 80 ఏళ్లు పైబడిన వారు 6 వేల మందికి పైగా ఉన్నారు.