HYD: ఇంజినీరింగ్ విద్యార్థి జాదవ్ సాయితేజ ఆత్మహత్య కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను రిమాండ్‌కు పంపారు. చిన్న గొడవపై సాయితేజను బార్‌కు తీసుకెళ్లి బిల్లు చెల్లించమని బలవంతం చేసి అవమానించడంతో మనస్తాపం చెంది అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివ, ప్రశాంత్, రోహిత్, మురళీధర్, సాయిప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.