సూపర్-4లో 2 మ్యాచుల్లోనూ ఓడిన శ్రీలంక.. ఇప్పుడు ఫైనల్ ఆశలన్నీ భారత్, బంగ్లాపైనే పెట్టుకుంది. లంక ఫైనల్ చేరాలంటే భారత్ తమ 2 మ్యాచుల్లోనూ ఓడటంతో పాటు బంగ్లా తర్వాతి 2 మ్యాచుల్లో గెలవాలి. అలాగే భారత్‌పై లంక భారీ విజయం సాధించాలి. ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఓడించడం బంగ్లా, లంకకు అసాధ్యమే. ఇక లంక అనుకున్నట్లే అయినా ఫైనల్ చేరాలంటే NRR కీలకం అవుతుంది.