NDL: ఈనెల 29న ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. 14 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఆపై చదివినవారు అర్హులని తెలిపారు.