ELR: జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి వద్ద పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ మంగళవారం రాత్రి బోల్తా పడింది. రోడ్డుపై ఉన్న గోతుల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. వేరే వాహనం సహాయంతో ట్రాక్టర్ను పైకి లేపి, తిరిగి లోడ్ చేసుకుని వెళ్లారు. రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.