NLG: వార్షిక ఆడిట్ అకౌంట్స్, ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించనందుకు తెలంగాణ ఇంటి పార్టీకి రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం షోకాజు నోటీసులు జారీ చేసిందని కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల జాబితా నుంచి ఆ పార్టీని ఎందుకు తొలగించకూడదో పూర్తి ఆధారాలతో కూడిన ఆపిడవిట్ను పార్టీ అధ్యక్షుడు ఈ నెల 29లోగా సమర్పించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.