భారత లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సర్రే తరఫున అరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు నేటి నుంచి 27 వరకు హంప్షైర్తో జరిగే సీజన్ ఎండింగ్ మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా సాయి కిషోర్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో చాహర్ని తీసుకున్నట్లు సర్రే క్లబ్ డైరెక్టర్ అలెక్ స్టీవార్ట్ వెల్లడించాడు.