KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గాజులదిన్నె ప్రాజెక్టు మంగళవారం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరదనీరు చేరడంతో, ప్రాజెక్టు నీటిమట్టం 376.88 మీటర్లకు చేరుకుంది. దీంతో, ప్రాజెక్టు నుంచి నాలుగో గేటు ద్వారా హంద్రీ నదిలోకి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ మహమ్మద్ ఆలీ తెలిపారు.