ప్రకాశం: ప్రజలు, ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాట్సాప్ గ్రూపులు వాడుకొని అసభ్యంగా వ్యాఖ్యానించడం పట్ల పోలీసులు తీవ్ర దృష్టి సారించారని తెలిపారు.