71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఢిల్లీలో జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ ఈవెంట్లో సబ్యసాచి డిజైన్ చేసిన హెరిటేజ్ చీరలో నటి రాణి ముఖర్జీ హైలైట్గా నిలిచారు. అంతేకాదు ఆమె మెడలో ధరించిన సన్నని నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన కూతురు అదిరా చోప్రా పేరులోని అక్షరాలతో తయారుచేయించుకున్న నెక్లెస్ను వేసుకున్నారు.