వనపర్తీ పట్టణం చిట్యాల పెట్రోల్ బంక్ ఎదురుగా గల పాత ఇనుప సామాను గోదాంలో మంగళవారం 6 అడుగుల కొండచిలువను పట్టివేశారు.స్నేక్ క్యాచర్ సాగర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు చీర్ల కృష్ణ సాగర్ కథనం ప్రకారం.. గోదాం యజమాని తాజావుద్దీన్ సాయంత్రం 5 గంటలకు షాప్ సెట్టర్ తెరిచారు. సంచుల మాటున కొండచిలువ కనిపించగా భయాందోళనతో కృష్ణ సాగర్‌కు సమాచారం ఇవ్వగా వారు పామును బంధించారు.