సత్యసాయి: సోమందేపల్లి మండల పందిపర్తిలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణంనకు గురువారం భూమి పూజ చేశారు. మంత్రి సవిత అడిగిన వెంటనే ఓవర్ హెడ్ ట్యాంక్‌ను మంజూరు చేసి గ్రామ నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. దీంతో మంత్రి సవితకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ వెంకటేష్, తహసీల్దార్ మారుతి ప్రసాద్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.