GNTR: గుంటూరు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఈనెల 27న మధ్యాహ్నం 2:30 గంటలకు కలెక్టరు కార్యాలయంలో జరగనుంది. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షత వహిస్తారు. కలెక్టరు తమీమ్ అన్సారియా, జిల్లా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.