రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్లు (A,C,E,D), జింక్, ఒమేగా వంటి పోషకాలు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తినాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే చేపలతో పాటు అల్లం, వెల్లుల్లి, తృణధాన్యాలు తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఆహారాలను తినడం తగ్గించాలి. అలాగే సరైన నిద్ర, క్రమమైన వ్యాయామాలు, పరిశుభ్రత వంటి నియమాలు పాటించాలి.