భారత్ ఆసియాకప్ ఫైనల్‌కు చేరినప్పటికీ టోర్నీలో 12 క్యాచ్‌లు చేజార్చడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి అసహనం వ్యక్తంచేశాడు. ఫైనల్లో ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా ఆటను మెరుగుపరుచుకోవాలని సూచించాడు. దుబాయ్ గ్రౌండ్ లైట్స్ కారణంగా క్యాచ్ పట్టడం అంత తేలిక కాదని, పరిస్థితిని అధిగమించడానికి ప్లేయర్లు మరింతగా ఫీల్డింగ్, క్యాచ్ ప్రాక్టీస్ చేయాలని అన్నాడు.