పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులకు సహకరించి మహ్మద్ యూసఫ్ కటారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దర్యాప్తు క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదులు తమ హ్యాండ్లర్లతో, కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడేందుకు మొబైల్ ఫోన్ ఛార్జర్లు కొనుగోలు చేశారు. వాటిని ప్రముఖ ఆన్లైన్ పోర్టల్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు.