HYD నుండి హన్మకొండకు వచ్చే RTC ప్రయాణికులకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు. మూసీ నదికి భారీవరద నేపథ్యంలో MGBS ప్రాంగణంలోకి వరదనీరు చేరింది. దీంతో MGBS బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను TGSRTC తాత్కాలికంగా నిలిపివేసింది. MGBS నుంచి WGL, HNK వైపుకు వచ్చేవి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వస్తున్నాయి. విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.