JGL: మెట్పల్లి పట్టణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని, నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.