బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.600 పెరిగి రూ.1,15,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరిగి రూ.1,05,850 పలుకుతోంది. అలాగే, వెండి ఒకే రోజు రూ.6 వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,59,000కు చేరింది. అయితే, శుభకార్యాల కోసం బంగారం కొనేవారు ఆందోళన చెందుతున్నారు.