E.G: శరన్నవరాత్రులు సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు గురువారం శ్రీ కాత్యాయనీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు అమ్మవారి అనుగ్రహంతో సుఖసంతోషాలతో జీవించాలన్నారు.