HYD: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు గజలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గజలక్ష్మీ అంటే ఏనుగులతో ఉన్న లక్ష్మీ దేవత అని అర్థం. ఈ రూపంలో ఆమె పద్మాసనంపై కూర్చుని ఉండగా, ఇరువైపులా ఏనుగులు ఆమెపై నీటిని పోస్తుంటాయి. ఈ అమ్మవారిని దర్శించుకుంటే శ్రేయస్సు, సంపద, అదృష్టం కలుగుతుందని భక్తుల నమ్మకం.