E.G: కడియం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మరణించినట్లు రాజమండ్రి జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతుడు ముదురు ఆకుపచ్చ రంగు టీషర్ట్, తెలుపు గళ్ల టవల్ ధరించి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 0883–2442821, 99597 63463, 94407 79249 ఈ నంబర్లకు తెలపాలన్నారు.