SRD: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులు కసరత్తు చేపట్టారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీ, 261 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందోనని రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.