ATP: PABR నార్త్ కెనాల్ నుంచి యాడికి బ్రాంచ్ కెనాల్‌కు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. రైతుల అభ్యున్నతి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ప్రాంతీయ రైతుల సమస్యలను గుర్తించి, వారికి సమయానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నీటి విడుదలతో రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది.