ప్రకాశం: భైరవకోన శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. DSP సాయి ఈశ్వర్ యశ్వంత్ శ్రీ భైరవేశ్వర, త్రిముఖ దుర్గాంబ దేవిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో DSP పాల్గొన్నారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందజేసి అమ్మవారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. SI వెంకటేశ్వర్లు నాయక్ కూడా పాల్గొన్నారు.