W.G: సమిత్వ సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం విస్సాకోడేరు గ్రామ సచివాలయం కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. సమిత్వ సర్వేపై ఆరా తీసి, రికార్డులు పరిశీలించారు. పీపీఎంలు, ఇప్పటి వరకు ఎన్ని మ్యాపింగ్ అయ్యాయి, మ్యాపింగ్ చేసేటప్పుడు ఏ విధానాలను పాటిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.