KMM: నేలకొండపల్లి మండలంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతనగర్ గ్రామం సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.