BHNG: సమాజంలో మతసామరస్యం కోసం చివరిదాకా పోరాడిన మహోన్నత వ్యక్తి ఎస్.కే లతీఫ్ సంతాప సభను జయప్రదం చేయాలని, ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఎగ్బాల్ కోరారు. ఆలేరులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25న జిల్లా కేంద్రం సుందరయ్య భవనంలో ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఎస్.కే లతీఫ్ సంతాప సభ ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.