ELR: సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో జీవించేలా అందరూ ప్రోత్సహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి హాల్లో మంగళవారం బధిరుల సాంకేతిక భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భాష ఏదైనా భావ వ్యక్తీకరణ ప్రధానమన్నారు. అర్హులైన బధిరులకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు.