NTR: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇవ్వాలని యూ.పీహెచ్సీల సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావుకు సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజా రత్నరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ, పెన్షన్, టర్మ్ ఇన్సూరెన్స్, ప్రమాద భీమా, ఆరోగ్య భీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.