PPM: గరుగుబిల్లి వైసీపీ ఎంపీపీ ఉరిటి రామారావు మంగళవారం కురుపాం శాసనసభ్యులు జగదీశ్వరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయనతో పాటుగా 5గురు ఎంపీటీసీలు 8 గ్రామాల సర్పంచులు, పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంనచ్చి చేరామన్నారు.