W.G: మచిలీపట్నంలోని గొడుగు వేంకటేశ్వర స్వామికి చెందిన దేవాదాయ శాఖ భూములను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రభుత్వంతో కుమ్మక్కై కాజేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన తాడేపల్లిగూడెంలోని తన కార్యాలయంలో మాట్లాడారు. గతంలోనూ ఈ భూములను కాజేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.