WGL: దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన 51 అడుగుల భారీ అమ్మవారి విగ్రహాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక BRS నాయకులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.