KMM: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్యలను కోరారు. మంగళవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను, నగర ప్రజల సమస్యలను వివరించారు. మేయర్, కమిషనర్ కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.