AKP: దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. మంగళవారం అనకాపల్లిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబ్జి, ఫణీంద్ర మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు ప్రభుత్వం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించిందన్నారు. అయితే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ కళాశాలలు నిబంధనలు పాటించడం లేదన్నారు.