KDP: చెన్నూరు మండల కేంద్రంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో అక్టోబర్ 2వ తేదీ నాటికి చెన్నూరు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక బాలికల పాఠశాలలో మహిళా సంఘాలు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.